21, జూన్ 2010, సోమవారం

"కామశాస్త్రి Vs పిల్లకాయలు "

ఆ మధ్య ఒక టపా లో మా ఇంటర్ కాలేజీ లో "నా నిద్ర" సంగతు లు మాట్లాడుకున్నాము కదా!...మరి కాలేజీ అన్నాక డైరెక్టర్, ప్రిన్సిపాల్ etc ఉంటారు కదా..మా ప్రియతమ "డైరెక్టర్" గారి పేరు "కామశాస్త్రి", పిల్లకాయల కి ఆయన అంటే గౌరవం, భక్తి, అంతకు మించి బోలెడంత భయం.
కామశాస్త్రి గారూ చూడడాని కి నల్ల గా ,దానికి తోడూ చాలా లావు గా ఉంటారు, కావున సహజంగా నే పిల్లకాయల కి అయన అంటే భయం. ఆయన ఎక్కువ గా మాట్లాడారు, కాకపోతే "కంటి చూపు తో" చంపేసే రకం. ఆయన ఇంటర్ రెండో సంవత్సరం పిల్లల కి గణితం సబ్జెక్టు లో "సదిశ" లు చెప్పేవారు. మేము మొదటి సంవత్సరం లో ఉన్నప్పుడు "ఇడ్లి టిఫిన్' ఉన్న రోజున పిల్లలంత టిఫిన్ పడేస్తున్నార ని తెలిసి "మా హాస్టల్ క్యాంటిన్" కి ఒకసారి చూడడాని కి వచ్చారు....ఇంకాచెప్పొద్దూ ఎప్పుడు ఇడ్లి పడవేసే మేము ఆ రోజు పెట్టిన ఇడ్లిలు చక్క తినేసం బుద్దిమంతుల్లా...
ఇంకా మేము రెండో సంవత్సరం లోకి వచ్చేసరి కి అప్పటి వరకు " కో-ఏడ్" గా ఉన్న కాలేజీ ని కాస్త ఆయన రెండు గా విభజించేశారు. ఒక్క ఇంటర్ రెండో సంవత్సరం తప్ప నా తక్కిన చదువంత "కో-ఏడ్" తరహ లోనే సాగింది. మా ప్రత్యేక "మహిళా కళాశాల" నాకు విచిత్రం గా అనిపించేది, అంత "అమ్మాయిల " మాయం. కొన్ని తరగతులు "కంబైండ్" తరహ లో సాగేవి....అందులో "సదిశలు" కూడ ఒకటి.

ద్వితీయ సంవత్సరం ఒక్క తెలుగు మీడియం లోనే రెండు వందల పైచిలుకు విద్యార్ధులు ఉండేవారు....అందరి కి కలిపీ కామశాస్త్రి గారి "సదిశ లు " క్లాసు కాలేజీ గ్రౌండ్ లో ఉన్న పెద్ద చెట్ల నీడన సాగేవి. కామశాస్త్రి గారి కి ముందు వరుస లో అమ్మాయి లు, ఆ తర్వాత అబ్బాయి లు కూచునేవాళ్ళు. ఆయన గొంతు చాలా గంభీరం గా ఉండేది, ఈ చివర నుండి ఆ చివర దాక ఒకే రీతి లో వినిపించేది.... ఎక్కువ గా ఈ క్లాసు లు మద్యాహ్నం పుట జరిగేవి,చెప్పేదేముంది అందరి కి ఆ క్లాసు లో నిద్ర వచ్చేది....కాకపోతే ఆయన గారి కి భయపడి ఎవరు కళ్ళు మూసుకుని నిద్ర పోవడాని కి సాహసించేవారు కాదు, "కళ్ళు తెరిచి" మాత్రం కొందరు నిద్ర పోయేవారు,అందులో నేను ఒకదాన్ని.క్లాసు మధ్య లో ఎవరైన నిద్ర పోతున్నార? అని ఆయన గమనించేవారు...ఎవడైనా దొరికాడ!! అంతే సంగతు లు....నిద్ర పోయేది అమ్మాయి లు అయితే మాత్రం కోపం గా చూసేవారు...అదే అమ్మాయి ల కు పెద్ద శిక్ష.

"study hours" లో ఎవరైనా సరిగ్గా చదవక పోయిన, అల్లరి చేసిన ,తక్కువ మార్కులు వచ్చిన ....కామశాస్త్రి గారి నోటి లో, చేతి లో నలిగి పోయేవారు పాపం పిల్లకాయలు :(

9 కామెంట్‌లు:

మధురవాణి చెప్పారు...

:-) :-D

divya vani చెప్పారు...

అవునండి పాపం పిల్లకాయలు ..... మరి మీరెప్పుడు దొరకలేదా అండి మీ కామశాస్రి గారికి ?

srikanth jessu చెప్పారు...

he resembles Amitabh (+ bit rude) in Mohabbatein.....

*** the images you used in this post are very awesome.. ****

Ram Krish Reddy Kotla చెప్పారు...

రాధిక గారు, నేను ఇంటర్ చదివేప్పుడు కూడా ఇలాంటి ఆయన ఉండేవాడు...మాకు మాత్స్ చెప్పేవాడు...ఆయన పేరు హరిశంకర్..ఆయన గురుంచి రాస్తే ఒక పెద్ద పోస్ట్ అవుద్ది...అసలు మాత్స్ సార్స్ అందరూ అంతేనేమో :-)

శివరంజని చెప్పారు...

అయితే మీ సార్ ఎక్కడున్నా వెదికి మీ పై నేను చాడీలు చెప్పేస్తాను

రాధిక చెప్పారు...

@ మధురవాణి గారు,
అలా నవ్వడానికి అర్థం ఏంటని..నాకు తెలియక అడుగుతున్నాను, మీ ఉద్దేశం ఏంటని....మేమెంత కష్టాలు పడ్డామో మీకు తెలుసా!
{just kidding :-)}
@దివ్య వాణి గారు,
నేను నిద్ర పోయినప్పుడు మా కామశాస్త్రి గారు నన్ను చాలా సార్లు చూసారు..కానీ అది నన్ను కాదులే అని నాకు నేను సరి పెట్టుకున్ననోచ్ .. :-)
@శ్రీకాంత్,
ఆయన గారు నువ్వు క్లాసు లో నిద్ర పోయినప్పుడు ఎప్పుడైనా చూసారా ఏంటి?
@శివరంజని గారు,
మా సార్ దృష్టి లో నేను "మంచి అమ్మాయిని" ...మీరు ఎన్ని చాడీలు చెప్పిన నమ్మరు కదా!! :-))
@రామకృష్ణ గారు,
అవును ఈ మాథ్స్ చెప్పెవల్లంతా ఇంతేనేమో :(

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మీ కళాశాలలో విషయాలు చదువుతుంటె నాకూ వెంటనే నా కాలేజ్ విషయాలు చెప్పలనిపిస్తుంది రాధిక గారూ..

రాధిక చెప్పారు...

@రాజి గారు,
ఐతే వెంటనే ఒక టపా రాసేయండి,మేము చదివి ఆనందిస్తాము సుమా... :-)

Srinivas K చెప్పారు...

Are you saying about Vijayasai College Bodhan. I have studied my Inter in 1997-1999. Kamashastri used to teach probability In second year.