నేను ఈ మద్య "ఉగాది" పండక్కి ఇంటికి వెళ్ళాను..ఓ రోజు సాయంత్రం టీవీ చూస్తుకూచున్నాను ఏమిపాలుపోక , అప్పుడొక చిన్న సంగటన జరిగింది. ఆ చిన్ని సంగటన నన్ను ఆలోచింపచేసింది...నేను టీవీ చూస్తున్ననా, ఇంతలో మా అన్నయ్య వాళ్ళ బాబు పెన్ను, పేపర్ తో నా దగ్గరకొచ్చాడు, వాడికి నిండా మూడేల్లుండవు. వాడు నన్ను బొమ్మ గీసివ్వమని అడిగాడు, సరే అనేసి నేను దోతి వేసుకున్న చిన్న బాబు ను గీసాను, వాడు అది తనే అని గుర్తు పట్టాడు (ఉగాది కి వాడు పంచె కట్టుకుని ఊరంతా ఓ రౌండ్ వేసి వచ్చాడు అది సంగతి), నేను వాళ్ళ అమ్మ, నాన్న బొమ్మలు కూడ వేసిచ్చాను పనిలో పనిగా . వాడు నన్ను "అత్త దీంట్లో నువ్వు లేవు కదా నిన్ను కూడ గియ్యి అని అడిగాడు నేను చాలా ఆశ్చర్యపోయా! అలా వాడు మా కుటుంబ సభ్యుల బొమ్మలన్నీ వేసేదాకా నన్ను వదలేదు....నాకు చాల ఆనందమేసింది వాణ్ణి చూసి....వాళ్ళ నాన్నగారి పెంపకం చూసి ఒకింత గర్వం గా కూడ అనిపించింది. మా అన్నయ్య చాల మంచి మనిషి, విలువలు తెలిసిన మనిషి, మా వదిన ఎప్పుడు అంటూ ఉంటుంది వీడు మీ అన్నయ్యలాగా అవుతాడో లేదో అని...ఆ క్షణం లో అనిపించింది వీడు మా అన్నయ్యకి మల్లె "మంచి వాడనిపించుకుంటాడు అని "
"న్యూక్లియర్ ఫ్యామిలీ అంశం పుణ్యమా అనీ మన ఫ్యామిలీ ఫోటో లో మమ్మీ, డాడీ తప్ప ఎవరు కనిపించ కుండ పోతున్నారు..."మొక్కై వంగనిది మ్రానై వంగునా" అని సామెత, పిల్లలకు మంచి విలువలు నేర్పాల్సిన బాద్య త ఎంతయినా తల్లి దండ్రుల పైన ఉంది."