5, జూన్ 2010, శనివారం

నేను,చదువు,కుంభకర్ణుడి నిద్ర

ఈ మధ్య ఫ్రెండ్ ఒకరు మాట ల మధ్య నీ బ్లాగ్ లో స్కూల్ డేస్, లేదా కాలేజీ డేస్ గురించి రాయొచ్చు కదా! అని అడిగితే, రాయొచ్చు కాని నాకే బద్ధకం రాయడానికి అని సెలవిచ్చాను.సరే లే బద్దకం లో భాగం అయిన "నిద్ర" గురించి రాస్తే పోలా ...
నేను ఇంటర్ కోసం అని పక్క ఊళ్ళో ఉన్న రెసిడెన్సియల్ కాలేజీ లో చేరిపోయాను. నా లక్ష్యం "BITS PILLANI" లో B.Tech చేయాలనీ, అక్కడ అయితే బాగా చెప్తారని, ఇంట్లో పేచి పెట్టి చేరి పోయా..పదవ తరగతి వరకు బాగా చదివేదాన్ని, బాగా అల్లరి చేసేవాళ్ళం. పెద్ద గా చదవండి అని ఎవరు ఇబ్బంది పెట్టె వారు కాదు, చాలా ఆనందం గా గడిచి పోయాయి ఆ రోజులు. కాని ఈ కాలేజీ మొదటి రోజే జైలు ని తలపించింది....


పొద్దున్న ఐదు గంటలకి చదువు మొదలవుతుంది, రాత్రి ఎన్మిదింటి కి ముగుస్తుంది. కొత్తలో బాగానే చదివేదాన్ని. అదంతా మెకానికల్ గా అనిపించడం మొదలైంది. పొద్దున్న "study hours" లో కొద్ది సేపు చదివి నిద్ర లోకి జారి పోయేదాన్ని. ఇది గమనించిన మా లెక్కల మాష్టారు "నాగరాజు గారూ" నన్ను తన ముందు బెంచి లో కూచోమని చెప్పి లెక్కలు చేయమని చెప్పేవారు. కొద్ది సేపు చదివేదాన్ని...తర్వాత మళ్లీ కథ మొదటికే వచ్చేది.
క్లాసు లు 8 గంటల కి మొదలయ్యేవి. కొద్ది సేపు విని నిద్ర ని కంట్రోల్ చేసుకోడాని కి నోట్ పుస్తకం లో హిందీ, ఆంగ్లం లో ఇష్టం వచ్చినట్టు గా రాసేదాన్ని. పక్కనే ఉన్న నా స్నేహితురాలు నందన కి ఇదేమి అర్థం అయ్యేది కాదు. సురేష్ మాష్టారి బౌతిక శాస్త్రం క్లాసు లో మాత్రం నా కష్టాలు వర్ణనాతీతం. ఆ క్లాసు లో ఎవరైన నిద్ర పోడానికి సాహసించార...అంతే సంగతులు....తిట్ల వర్షం,అబ్బాయి లనైతే ఏకం గా "డెమో స్టేజి" మీద దిష్టి బొమ్మ లాగ నిలుచోబెట్టేవారు. నిద్రను కంట్రోల్ చేసుకోడాని కి ఆ క్లాసు లో పడ్డ తంటాలు దేవుడి కి ఎరుక, మా నంది కి కూడ కొంచం తెలుసు.
పరీక్షల ముందు గ్రౌండ్ లో కూచో బెట్టేవారు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళను వేరు గా కూచో బెట్టేవారు. ఎందుకో మరి పెద్ద పరీక్షలప్పుడు మమ్మల్ని,ఇంగ్లీష్ మీడియం వాళ్ళను కలిపి కూచో బెట్టారు. నన్ను ఒక ఇంగ్లీష్ మీడియం అమ్మాయి పక్కన కూచోబెట్టారు, ఎప్పుడు నిద్ర పోయే నా దగ్గర నోట్ పుస్తకాలూ ఉండవు...లెక్కలు పరువలేదు కాని వేరే విషయాలు ఇంగ్లీష్ లో నాకు అర్థం అయ్యేవి కాదు...చాలా ఏడుపు వచ్చేది, నందన కాస్త నోట్ పుస్తకాలూ సహయం చేసేది. పరీక్షలు వేరే సెంటర్ లో రాసేవాళ్ళం, మధ్య లో నిద్ర వచ్చి ఏదో రాసేదాన్ని ఆంగ్లం లో ,మళ్లీ తేరుకుని సరి చేసి రాసేదాన్ని. ఇలా నా కష్టాలు సాగాయి.
కొసమెరుపు ఏమిటి అంటే నాకు తొమ్మిది వందలకు కుంచం మార్కు లు తగ్గాయి. BITS దేవుడెరుగు. అమ్మో, జైలు గోడలు కలలో కూడ నన్ను వెంటాడుతాయి ఇప్పటి కి. మా నందన మాత్రం నా నిద్ర విషయం గుర్తు చేసి ఏడిపిస్తూ ఉంటుంది.

35 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

I still remember those days. She s my bench mate. First I observed her "kumbakarna nidra" in english class. she was writing like "friendship= cos(x)????????????" I didn't even understand a single word in her notes.

మంచు చెప్పారు...

బావుంది మీ నిద్ర పాట్లు :-)) .. friendship = cos(x)????????????

ఈ సెంటన్స్ కొద్ది పూర్తిచెయ్యండి :-)

"కుంచం" " కొంచెం " .. ఎది కరెక్ట్ ?? మీ ఇంట్రడక్షన్ లొ కూడా 'కుంచం' అనే రాసారు :-))

రాధిక చెప్పారు...

మంచు.పల్లకి గారూ,

మీ స్పందన కు నా ధన్యవాదాలు, ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికి నాకు నవ్వు ఆగదూ :-)

కుంచం అంటే "కొంచం" అనే అర్థం (కాకపోతే అది "బుడుగు" బాషలో..నాకు బుడుగు పాత్ర అంటే ఇష్టం అందుకని నా పరిచయం లో అలా రాసా)!!

swapna@kalalaprapancham చెప్పారు...

naku na inter gurtostundi, oka sari oka exam lo inko exam rasanu nidra mattu lo. night pettevallu language subjects. nidra nunchi terukoni chusaka identi ee subjet rasanu ani navvukunna piga line ala ala pike vellipoyindi. aha a rojule veru, inko sari nidra apukoleka lunch cheyakunda a thine time ni nidra ki ketayinchanu oka pakkana akalestunna kani :(

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

actual meaning of "kuncham" is different from "koncham"


gud one.

రాధిక చెప్పారు...

@ vinay
I do n't think it is diffrent from "koncham"...let me verify, but I like 2 use the word "Kuncham" instead of "koncham"

thanks 4 visiting my blog :-)

రాధిక చెప్పారు...

@ nandu,

I know u guys used 2 mug up loads of books,am a lazy bug...used 2 sleep somuch n class nothng 2 do wid books :-)

రాధిక చెప్పారు...

@ స్వప్న గారూ,

మీలానే నేను తినే టైం లో నిద్ర పోయేదాన్ని..క్లాసు లో మాత్రం బోలెడంత ఆకలి వేసేది :-)

Padmarpita చెప్పారు...

బాగున్నాయి మీ కునికిపాట్ల ముచ్చట్లు:):)

మంచు చెప్పారు...

బుడుగు బాషా.. అయితే ఒకే..

actual గా అయితే కుంచం అంటే ధాన్యం, బియ్యం కొవలడానికి ఉపయొగించే కొలమానం.. కుంచాలకి కుంచాలు తింటున్నారు అని వెటకారంగా అంటారు చూడండి అది ..... కొవలడానికి ఉపయొగించే పాత్రనికూడా కుంచం అనే అంటారు...
అలాగే భూమిని కూడా కుంచాలతొ కొలవచ్చు.. 10 కుంచాలు = 1 ఎకరం (కరెక్టెనా ??)

అదండి కుంచం గొడవ.. :-)))

రాధిక చెప్పారు...

@ వినయ్, మంచు.పల్లకీ గారూ,

మీ ఇరువురికి ధన్యవాదాలు...ఎందుకో సందేహం వేసి మళ్లీ " బుడుగు" చదివా.అందులో "కొంచెం" కి సమాన అర్థం లో "కుంచెం" అని వాడారు. నేను తప్పు గా "కుంచం" అని వాడాను, సరి చేసుకుంటున్నాను, ఇంతటి తో "కుంచం" గొడవ వదిలింది బాబోయ్ :-))

ఈ కింది లింక్ లో మీరు ఆ పద ప్రయోగం చూడొచ్చు
http://www.bapubomma.com/budugu%20story3.గిఫ్

రాధిక చెప్పారు...

@ పద్మార్పిత గారూ,

ఏదో మీ అభిమానం, మీరు ఇలా నా టపాల కు, కవిత లకు స్పందన రాయడం చాలా ఆనందం గా ఉందండీ :-)

మంచు చెప్పారు...

అహా.. ఈ కుంచం వల్ల నాకు మంచి లింక్ దొరికింది.. :-)) థాంక్యూ

శివ చెరువు చెప్పారు...

same story.. but I am having it at office he he he.. ;)

అశోక్ పాపాయి చెప్పారు...

maa classlo maa prinipal gaare nidrapoyevaaru...inka maa gurnchi ite meere telusukondi inka :-) same touch

రాధిక చెప్పారు...

మంచు.పల్లకీ గారూ,

ఆశ,దోస,అప్పడం.. మీరు ఈ లింక్ ను చోరి చేస్తున్నారు.ఉండండి బాపు గారి కి పిర్యాదు చేస్తా :-))

రాధిక చెప్పారు...

@ Shiva

if u having a nap at office..tat s considerable bcz nobdy bothers abt his/her fellow being, so no issue ha ha ha :-))

రాధిక చెప్పారు...

@ అశోక్ గారూ,

ఇలా మీరు నా టపా ల కు స్పందన రాయడం ఆనందం గా ఉందండీ!! మీరు ఎంత అదృష్టవంతులండి!! నూటి కో కోటి కో అలాంటి వారు ఒక్కరు ఉంటారు :-)

అశోక్ పాపాయి చెప్పారు...

meeru annadi ento ardam kaaledu

రాధిక చెప్పారు...

@ అశోక్ గారూ,

నా ఉద్దేశం మీ ప్రిన్సిపాల్ చాలా మంచి వారు అని, తను నిద్ర పోయేవాడు కాబట్టి పిల్లకాయలకి ఏ సమస్య లు లేకుండా నిద్ర పోవచ్చు కదా!!

మధురవాణి చెప్పారు...

అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాను మీ పోస్ట్ చదువుతూ.. ఎందుకంటే మనిద్దరం 'same pinch ' చెప్పుకోవచ్చు. నా నోట్సుల్లో కూడా 'మోడరన్ ఆర్ట్' లాగా ఏవేవో గీసేస్తుండేదాన్ని అర్ధం పర్ధం లేకుండా! నిద్రాపుకోడానికి ప్రతీ పీరియడ్ అయిపోయాక కుండల్లో పెట్టే చల్లటి మంచినీళ్ళతో మొహం కడుక్కురావడం, అయినా మళ్ళీ తూలిపోవడం, కష్టపడి రెప్పలు వాలిపోకుండా చూస్కోడం...బాబోయ్ అంతకంటే టార్చర్ ఇంకోటి ఉండదు. తిండి టైములో నిద్ర, తరవాతేమో ఆకలి :( ఘోరం అలాంటి హాస్టళ్ళలో చదువులు మాత్రం :(

srikanth jessu చెప్పారు...

నాదే అది పరిస్థితి.. నేను ఒక సారి తన్నులు కుడా తిన్నట్టు గుర్తు క్లాసు లో నిద్రపొఇనన్దుకు ... ఈ టపా చదివాకా నాకు అన్ని గుర్తుకోస్తున్నై ..

శివరంజని చెప్పారు...

నిద్ర గురించి నేను కూడా పెద్ద పోస్ట్ రాసానండి . నీకు రాయడానికి ఈ సబ్జెక్ట్ తప్ప ఏమి దొరకలేదా అని మా ప్రెండ్స్ అంతా ఏడిపించారు నన్ను. నిద్ర లో నేను మీకన్నా మించిపోయానులేండీ .

రాధిక చెప్పారు...

@ శ్రీకాంత్,

నువ్వు క్లాసు లో నిద్ర పోవడమా?.....దెబ్బలు కూడ తిన్నావా? ఏమో, చూశావా!! నేను ఎంత బాగా నిద్ర పోయేదాన్ని, నాకు ఈ విషయం నువ్వు చెప్తే గాని తెలీదు :-))

రాధిక చెప్పారు...

@ శివ రంజని గారూ,

పాపం మీ ఫ్రెండ్స్ అంత బాగా చదివే వారేమో,నిద్ర పోకుండా!! .... అందుకనే అలా మిమ్మల్ని ఏడిపిస్తారు కాబోలు :-))

రాధిక చెప్పారు...

@ మధురవాణి గారూ,

మొదట నా టపా కి మీ నుంచి వ్యాఖ్య రాక పోయేసరి కి ఎందుకో కుంచెం దిగులు గా అనిపించింది.తర్వాత మీ స్పందన చూసి చాలా మురిసిపోయాను,"పద్మార్పిత" గారూ చెప్పినట్టు నాకు కూడ మీరు "మధరం" గానే అనిపిస్తారు :-))

ఇంకా నయం మీరు క్లాసు అయ్యాకే అలా మొహం కడుక్కోడాని కి వెళ్ళేవారు, నేనైతే "study hours" లో నీళ్ళ కుండ దగ్గరే ఎక్కువ సమయం గడిపే దాన్ని,క్లాసు లో కంటే. వార్డేన్స్ నిల్చో బెట్టి చదివించే వాళ్ళు నిద్ర పోయేవాళ్ళను, నేను ఆ జాబితాలో కే వస్తాను కాబట్టి ,ఎక్కువ సేపు నిల్చునే ఉండేదాన్ని . క్లాసు లు జరిగేటప్పుడు నిద్ర పోకుండా ఆపుకోవడం అంటే అమ్మో ఆ బాధ వర్ణనాతీతం.....రాధిక!! అని రాధాకృష్ణ మాష్టారు ఒక కేక వేసే సరికి నేను ఈ లోకం లోకి వచ్చేదాన్ని అప్పుడప్పుడు :-))

Unknown చెప్పారు...

hahahhaha.....
meeku appudu nidra vachedi...
inter ante naku ippatikii nidra vachestundi...
baboi elago gattekkesam..mottaniki.. :P...

రాధిక చెప్పారు...

@ కిరణ్ గారు,
బాబోయ్ ఆ రోజులు మొత్తం నాకైతే నిద్ర పోవడంతోనే సరిపోయింది...మొత్తని కి మీరు నా జట్టే నన్న మాట భలే భలే :-))

శ్రీ చెప్పారు...

పాపం! బాగా కష్టపడి చదివినట్టున్నారు.

మా కాలేజిలో అయితే నేను సెకండ్ ఇయర్లో ఒక రోజు బోరు కొట్టి క్లాసుకు వెళ్తే "ఎవరు కావాలి బాబూ" అని అడిగారు.

కాకపొతే నాకు 900 లో సగం దాటి ఇంక కుంచెం వచ్చాయి.

రాధిక చెప్పారు...

@ Sri,
thnx a lot 4 visitng my blog :-))

Satish Kumar చెప్పారు...

hi.....radhika.....wavvvvvv...chala bagundhi...nee "nidhra" story.
Naadhi +2 motham residential. Nenu ayithey class lo kani, study hours lo kaani...nidhura poni roju ledhu....okka second shows ki vellinappudu thappa. class lo naa benchmates nannu chusi, paapam vallu kuda nidhura poyevallu...even maa mother kuda thittedhi naa nidhurani chusi.......hahahahahah....very funny....

మంచికంటి చెప్పారు...

మీ బ్లాగ్ చూసాను .చాలా బాగుంది మీ కవిత్వం చాలా చాలా తాజా తాజాగా .మంచి కవిత్వం చదవండి. ఇంకా బాగా రాయగలరు.మా వారధిలో చేరండి.మంచి కద ,కవిత్వాన్ని ప్రోత్సహించే వేదిక రచయితల సహకారవేదిక

రాధిక చెప్పారు...

@ మంచికంటి గారు,
మీ స్పందన కు ధన్యవాదాలు :-))
@Sathish,
U also used 2 sleep n class....thnx 4 sharing ur stroy wid us buddy :-))

Unknown చెప్పారు...

Me blog meru rase vidhanam bavundandi...meku vilunnapudu okasari na blog kuda chusi me abhiprayam cheptarai asistu...

http://kallurisailabala.blogspot.com

Unknown చెప్పారు...

e post chadivi nenu ala ala na childhood days ki vellochhanu...baga rasaru...i enjoyed alot...meru face book lo unnara

http:/kallurisailabala.blogspot.com