18, మే 2010, మంగళవారం

మధుర "మీనాక్షి"



మీరు ఎప్పుడైనా మదురై వెళ్ళారా? మీనాక్షి అమ్మ వారి గుడి ఎంత మధురం గా ఉంటుంది...అంతే మధురం గా ఉంటుంది మా "మీనాక్షి" ,తనది మదురై.

నేను MBA కోసం మంగుళూరు వెళ్ళాను. నాకు తొలిసారి గా కాలేజీ లో తను పరిచయం అయ్యింది. చాలా మంచి అమ్మాయి. నాకు తెగ నచ్చేసింది. తను మాకు మదురై విశేషాలు చెప్పేది, సబ్జెక్టు లో నాకు ఏది అర్థం కాక పోయిన వివరించి చెప్పేది. తక్కువ మార్కు లు వచ్చి నేను బాధ పడినప్పుడల్లా ఓదార్చేది. మాకు "తమిళ నాడు " వంటకాలు చేసి పెట్టేది. మా గ్రూపు లో తెలుగు వాళ్ళ సంఖ్య ఎక్కువ...తమిళ జాతి వాళ్ళు "నల్ల గా" ఉంటారని ఏడిపించే వాళ్ళం, తను మాత్రం "మేము నల్ల గా ఉన్న మా మనసు తెలుపు" అని సమాధానమిచ్చేది. ఉత్తర భారతానికి చెందిన ఇంకో గ్రూపు తనని "మదురై అమ్మ" అని ఏడిపించే వాళ్ళు.

మీనాక్షి మహా చురుకైన పిల్ల, చాలా తొందర గా తెలుగు నేర్చుకుంది, ఇంకా తన ముందు తెలుగు మాట్లాడడం మానేసాం మేము. తను మమ్ము "కుక్క,పంది" అని తిట్టేది, మేము చాలా నవ్వుకునే వాళ్ళం. ఆ అమ్మాయి అంటే మా అందరి కి అభిమానం. తను ఇంటి నుండి వచ్చేప్పుడు మా అందరి కి సరిపడేంత ప్రసాదం, తినుబండారాలు తీసుకు వచ్చేది.

ఒకసారి తను నన్ను మదురై తీసుకు వెళ్ళింది. మేము ట్రైన్ లో ముందు కోయంబత్తూరు వెళ్లి, తర్వాత బస్సులో మదురై వెళ్ళాలి. మాకు ట్రైన్ లో ఒకే బోగి లో సీట్లు దొరక లేదు, ఇంకా తను చాలా కంగారుపడింది, నేను ఎలా ఉంటానో అని . పొద్దున్నే మేము స్టేషన్ లో దిగాం, లగేజి మోసేవాడు ఎక్కువ అడిగే సరికి వాణ్ణి తమిళం లో నాలుగు తిట్టేసరికి వాడు చక్క పోయాడు. మేము ఉపాహారం కోసం ఒక హోటల్ కి వెళుతుండగా ఆ దారిలో వెళుతున్న తమిళులను చూసాను, వాళ్ళు చాలా సాంప్రదాయబద్దం గా ఉన్నారు, నాకు అప్పటి నుండి వారి సంస్కృతి మీద గౌరవం పెరిగింది.

మదురై లో నేను చాలా ఆనందం గా గడిపాను, వాళ్ళ కుటుంబం, బందువులు ఇంకా వాళ్ళింట్లో ఉన్న పాటి (అవ్వ)
అందరు తెగ నచ్చేసారు నాకు. నాకు "మధుర మీనాక్షి" అమ్మ వారి గుడి చాలా నచ్చింది, అంత అద్భుతమైన దేవాలయం చూడడము నా జీవితం లో అదే మొదటి సారి కాబోలు. నాకు మా మీనా వల్ల, తమిళ సంస్కృతీ, భాష మీద అభిమానం ఏర్పడింది.
తనని చూసి దాదాపు ఏడాది గడిచింది, చదువులు ఐపోగానే ఎవరి ఇళ్ళకు వాళ్ళం వచ్చేసాం, ఇంకా కలవలేక పోయాను. ఎంతైనా మా మీనా పాటి(అలా పాటి అని ఏడిపిస్తూ ఉంటాను) మధురమే ఆ మీనాక్షి అమ్మవారి లా....
తన తో స్నేహం దేవుడిచిన వరం నాకు.

10 కామెంట్‌లు:

చంద్రశేఖర్ కాటుబోయిన చెప్పారు...

baagaa chepparu..by the way mee peru lo yadav chusi ne postanu...me chandu from same saamajika tega

కొత్త పాళీ చెప్పారు...

Nice. :)
మదురై సిటీ చాలా చెత్తగా ఉంటుంది కానీ ఆలయాలన్నీ అద్భుతంగా ఉంటాయి. మీనాక్షి ఆలయం మరీనూ. అమ్మవారు కూడా కళ్ళుతిప్పుకోలేనంత అందంగా ఉంటుంది. బైదవే, మధుర మీనాక్షి అనే పేరుతో ఆరెస్. సుదర్శనం గారి కథ చదివారా? 100 గొప్ప తెలుగు కథలు ఎంచితే అందులో ఉండాల్సిన కథ.

Ravi చెప్పారు...

మరే.... సాంప్రదాయాలకు విలువనివ్వడంలో తమిళులకు ఎవ్వరూ సాటిరారు సుమా...

రాధిక చెప్పారు...

కొత్త పాళీ గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు :-)

మీరన్నట్లు మీనాక్షి అమ్మ వారి గుడి,అందులోని అమ్మవరి విగ్రహం, మరియు ఇతర కుడ్య చిత్రాలు,బంగారు కమలం అన్ని అధ్బుతంగా గోచారిస్తాయీ, ఆరెస్.సుదర్శనం గారి-మధుర మీనాక్షి కథ తప్పకుండా చదువుతాను.

రాధిక చెప్పారు...

రవిచంద్ర గారు అవును సుమండీ!సాంప్రదాయాలకు విలువనివ్వడంలో తమిళుల తరువాతే ఎవరైన :-)

రాధిక చెప్పారు...

@Chandu:thnx a lot 4 visiting my blog :-)

హను చెప్పారు...

nijame nenu chSanu chala bagumdi. nice place

రాధిక చెప్పారు...

I agree wid u..very nice place,nice people 2

మాలా కుమార్ చెప్పారు...

మధుర మీనాక్షిని చూడాలని ఎన్ని రోజుల కోరికో ! ఎప్పుడు ప్లాన్ వేసినా కావటము లేదు . మా డ్రైవర్ తమిళనాడు తప్ప ఎక్కడికైనా వస్తానంటాడు . మీ మీనా ను అడిగామని చెప్పండి .

రాధిక చెప్పారు...

మాలా కుమార్ గారూ,

తమిళులు చాలా మంచి వాళ్లండి! మీ డ్రైవర్ గారి ని ఎలాగైన తీసుకెళ్ళమని చెప్పండి, తను కూడ తన అభిప్రాయం మార్చుకుంటారు...మా మీనా తో మీరు తనని అడిగినట్లు చెప్పారని తప్పకుండ చెప్తాను.ధన్యవాదాలు