23, జులై 2010, శుక్రవారం

"స్ట్రీట్ చిల్డ్రేన్"


పదవ తరగతి లో కవయిత్రి "మహాజబిన్" రాసిన "స్ట్రీట్ చిల్డ్రేన్" కవిత మాకు పాఠ్యంశం గా ఉండేది.ఆ కవిత చదివినప్పుడల్లా బాధ గా అనిపించేది. అదే విషయాన్నీ తీసుకుని నా శైలి లో ఈ కవిత ను రాసాను......మిత్రులందరి కి చిన్న మనవి మనకు చేతనైనంత "వీధి బాలల " కు సహకరిద్దాం.
"నవ సమాజం లో
అనాగరికులం మనం
వారివి
ఎవరో చేసిన తప్పులకు
ప్రశ్నార్థకం గా మారిన బ్రతుకులు"
........................................
వారికి తోడంటు ఎవరున్నారు?
పసిమోము మీద
మిగిలిన కన్నీటి చారికలు తప్ప!
........................................
ఈ రోజు మీద ఆశ లేదు
రేపటి గూర్చి దిగులు లేదు
ఎవరి సహాయం కోసం
ఎదురు చూపుల్లేవు!
............................
లోకం వెక్కిరించిన
కాలం శూన్యం మిగిల్చిన
చిన్నిబ్రతుకుల్లో కారు చీకట్లు కమ్ముకున్న
పసి భుజాల మీద భారం మోస్తూ
వెనుదిరిగి చూడకుండా
ముందుకు సాగిపోవడమే తెలుసు
పయనం "అగమ్య" గోచరమైన!
...................................
ఎవరిని అడగాలి
ఏమని అడగాలి
గారాలుపోతూ
ఆరాలు తీయడానికి అమ్మ,నాన్న లు లేరు మరీ!!
....................................
ఆ జగన్నాథుని కే
మా మీద జాలి లేకపోతె
ఇంకెవరికి విన్నవించుకోవాలి?
బరువైన గుండెలతో
సాగిపోవడం తప్ప!!
.............................

14 కామెంట్‌లు:

కెక్యూబ్ వర్మ చెప్పారు...

మీ కవిత చాలా హృద్యంగా వుంది.. ఇదే అంశంపై నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా నేను ఓ కవిత రాసాను, చదవగలరు..
http://sahavaasi-v.blogspot.com/www.koodali.org

అశోక్ పాపాయి చెప్పారు...

రియల్లి మీరు చాల బాగ వ్రాస్తున్నారు.ప్రతి ఒక లైన్ కదిలిస్తుంది వీధి బాలల పట్ల మీకు వున్న ప్రేమ చాల మెచ్చుకోదగినది.మీకు కృతజ్ఞతలు మంచి కవితను వినిపించినందుకు.

చందు చెప్పారు...

చితికిన ఆ బ్రతుకుల్లో
నలిగిన చిరు రుపాలవి
మాసిన ఆ మనసులో
మనుగడ కై ఆరాటం
అంతు లేని పోరాటం
కొడిగట్టిన దీపలైనా
పూట గడిచేది కష్టమైన
అలుపు లేని పయనమది
అర్ధం కాని జీవన చిత్రమది
సయం కై ఎదురు చూడవు
చేస్తామంటే కాదనవు
నవసమాజ ధోరణి లో
తారతమ్య ఒరవడి లో
కొట్టుకు పోయే అల్ప ప్రాణులవి....!

srikanth jessu చెప్పారు...

very touching...

పరిమళం చెప్పారు...

Heart touching!

మనసు పలికే చెప్పారు...

చాలా బాగుందండీ..

చంద్రశేఖర్ కాటుబోయిన చెప్పారు...

మీకు అనాధ బాల పట్ల వున్న ప్రేమ చూస్తుంటే నిజంగా..నాకెందుకు ఇలా ఆలోచన రాలేదే అని,నేను కూడా అలాంటి వాల్లకి ఏమైనా చేయగలనా అని అలోచింప జేసింది మీ కవిత...రియల్లీ గ్రేట్ రాధికా..సూపెర్..
వీలుంటే నా బ్లాగ్ చూడండి..ధన్యవాదాలు

చంద్రశేఖర్ కాటుబోయిన చెప్పారు...

చాలా బావుంది రాధిక,హ్రుదయం ద్రవించింది.చక్కగా రాసారు...చంద్ర

Nagaraju చెప్పారు...

విశ్వ విజ్ఞానం తెలిపే నా భావాలను కొన్నైనా మేధస్సుతో గమనించండి
రేపటి సమస్యల పరిష్కారానికి నా భావాలు ఎంతో ఉపయోగపడుతాయి
ప్రతి జీవి సమస్యల కారణ భావాలను గమనించే జ్ఞానం నా భావాలలోనే
విజ్ఞాన భావాల విశ్వ భాషలో నా జీవితాన్ని లెక్కించుట లేదు ఎందుకో
నా జీవితం కన్నా విశ్వ జీవుల జీవిత విజ్ఞానం నా మేధస్సుకు శ్రేయస్సు

Hi
welcome to my blog
gsystime.blogspot.com
Read my blogs for spiritual information and universal intents
Thanks,
Nagaraju

అజ్ఞాత చెప్పారు...

bagundi.mee id cheppandi.
this is chakradhar.
http://namanobavalu.blogspot.com

K SURENDRA BABU చెప్పారు...

కవిత చాల బాగా వ్రాసారు.

అశోక్ పాపాయి చెప్పారు...

రాధిక గారు,

మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు .ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

అశోక్ పాపాయి చెప్పారు...

రాధిక గారు,

మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

ramesh lukulapu చెప్పారు...

manasu vinnadi