మనకంటూ బాల్య మిత్రులు ఉంటారు, నేను నాకు ఎంతో ప్రియమైన మిత్రురాలి గురించి చెప్పాలను కుంటున్నాను...తనూ నాకు శిశు తరగతి లో పరిచయం, తనకు బడికి రావడమంటే ఇష్టం, అందుకనే వాళ్ళ అన్నయ్య తో కూడా వచ్చేది, ఎప్పుడు పరిచయం అయిందో తెలిదు కానీ నేను ఒకటవ తరగతి చదివేటప్పుడు ఇద్దరమూ ఒకే దగ్గర కూచొని ఫోటో దిగాము అది ఇప్పటికి నా దగ్గర భద్రం, తను ఇంట్లో చెప్పకుండా ఓరోజు మాఇంటి కొచ్చి నాతో పాటు భోంచేస్తూ ఉంటే వాళ్ళ నాన్నగారు తన కోసం ఊరంతా తిరిగి మా ఇంటికొచ్చారు...ఇంకేముంది చక్కగా నాలుగు తగిలిచ్చారు. పదవ తరగతి వరకు ఒకే బెంచి లో కూర్చునే వాళ్ళము, ఇంటర్, డిగ్రీ వేరే కాలేజీ లో చదివిన అడపా దడపా కలుస్తూనే ఉండే వాళ్ళం. నన్ను తన సైకిల్ ఫై తిప్పేది....క్రికెట్ మ్యాచ్ లూ కలిసే చూసేవాళ్ళం ఇప్పుడూ అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటామూ కానీ మునుపటికి మల్లే అల్లరి చేయడానికి కుదరదు, నాకు సంతోషామేసిన, భాదేసిన తన తో పంచుకోవడమంటే నాకు చాలా ఇష్టం....మీకు నాలాగే దేవుడిచ్చిన అపురూపమైన స్నేహితులు ఉండే ఉంటారు వాళ్ళను వదులు కోకండి ఎందుకంటే వాళ్ళు మనము సంపాదించుకున్న విలువైన ఆస్తులూ....!!! మన బాల్యపు జ్నాపకాలూ!!!
4 కామెంట్‌లు:
నువ్వు narrate చేసిన విధానం is damn good yaaar..
అందుకే నిన్ను కవితల రాధిక అనే వారు ఇంటర్మీడియట్ లో తెలుసా..
రాధిక.. నా చిన్నప్పుడు ఇలాంటి సంఘటన జరిగింది..
నీ పొస్ట్ చదవగానె ఆ సంఘటన గుర్తుచేస్కున్నా.
keeep posting
thnx....
Ur Vocabulary suppppper.......
కామెంట్‌ను పోస్ట్ చేయండి