3, జులై 2010, శనివారం

"సీతాకోకచిలుక"


వన్నె చిన్నెల సీతాకోకచిలుక!!
నీలా
రెక్కలకు రంగులద్దుకోవాలి,
నీలాల నింగిలో
స్వేఛ్చ గా విహరించాలని,
నవ్వులను చిందించే
అందాల కుసుమలున్న పూదోటలో,
మకరందాన్ని ఆస్వాదిస్తూ
పరవశింప చేసే ప్రకృతి ఒడిలో
ఒక క్షణికమైన చాలు
జీవించి తరించాలని
నా కోరిక...
.............
ఎందుకని ఆ మందహాసం
నేను
నీలా విప్పారిన రెక్కలతో
ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ
పూదోటలో దోబూచులాడలేననేగా!!

12 కామెంట్‌లు:

చందు చెప్పారు...

మరి ఎప్పుడు రూపాంతరం చేడుతున్నారు సీతాకోకచిలక లా !జగ్రత్తందోయ్ సితకోకల మారాలంటే ముందు గోనగాలి పురుగు ల మారాలి సుమా!

Padmarpita చెప్పారు...

అన్ని పూలలో తేనెని మీరే త్రాగెస్తే ఎలా!:)

Yohanth చెప్పారు...

బాగుంది

RAMBABU చెప్పారు...

nice one , i think first line may be written as O, vanne chinnela seethaakoka chilukaaa,

ప్రణీత స్వాతి చెప్పారు...

పద్మార్పిత గారూ...అందుకేనేమో ఇంత మధురంగా వుందీ కవిత.

రాధికగారూ చాలా బాగుందండీ.

అశోక్ పాపాయి చెప్పారు...

Nice one..nd interesting How did you get such an idea:-)

srikanth jessu చెప్పారు...

it is very sweet like honey...

రాధిక చెప్పారు...

స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు :-)
@శేఖర్ గారు,
మీ రాక మాకెంతో సంతోషం సుమండీ!!
బ్లాగ్ కి విచ్చేసినందులకు ధన్యవాదాలు :-)

శివరంజని చెప్పారు...

నాకు సీతాకోకచిలక అంటే చాలా ఇష్టం ... దాని గురించి చాల బాగా రాసారు

మధురవాణి చెప్పారు...

చాలా బాగుంది సీతాకోక చిలుకతో మీరు చెప్పిన ముచ్చట. :)

అశోక్ పాపాయి చెప్పారు...

emandi raadhika gaaru emaindandi ee madya kotha postlu vrastaledu enduku??..mee taapa kosam eduru choostunnam andi koncehm rayandi twaraga meeku busy emo...ina ekkadiko vellipoyaru meeru koncehm veelu choosukoni rayandi..makorakaina....edi publish ceyakandi please...ashokpapai

Telugu Web World చెప్పారు...

NICE POETRY